తమ హయాంలో పలు కొత్త చట్టాల్ని తీసుకొస్తున్న మోడీ సర్కారు.. తాజాగా ప్రజలందరూ ప్రభావితమయ్యే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త అద్దె చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదానుతాజాగా విడుదల చేసి.. అభ్యంతరాల్ని వెల్లడించాల్సిందిగా కోరుతున్నారు. కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న ఈ కొత్త అద్దె చట్టాన్ని పరిశీలించి.. రాష్ట్రాలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం కోరింది. ఇళ్లను అద్దెకు ఇచ్చే వారి ప్రయోజనాల్ని కాపాడేందుకు వీలుగా.. కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల చివరి తేదీ లోపు.. ఈ కొత్త చట్టానికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని కేంద్రం కోరింది. కొన్నిచోట్ల యజమానులు మోసపోతుంటే.. మరికొన్నిచోట్ల అద్దె దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. .ఇలాంటివి చోటుచేసుకోకుండా ఉండటానికి వీలుగా కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉంది.
ఇంతకీ ఈ ముసాయిదాలో ఉన్న కొన్ని కీలక పాయింట్లను చూస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగాఅద్దెకు ఇవ్వాల్సిన వారు ఎవరైనా.. ఇంటి యజమాని.. ఇంటిని అద్దెక తీసుకునే వారు తప్పనిసరిగా రాతపూర్వకంగాఅగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా తేడా వస్తే.. అలాంటి వివాదాల పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ క్వాసీ జ్యూడీషియల్ మెకానిజం సిద్ధం చేస్తున్నారు.
అంతేకాదు.. నివాసం కోసం రెండు నెలలు గరిష్ఠంగా అద్దెను అడ్వాన్సుగా అడిగే వీలుంది. అదే కమర్షియల్ అయితే ఆరు నెలలకు ఎక్కువ కాకుండా అడ్వాన్సు ను తీసుకునే వెసులుబాటు కల్పించారు.ఇంతకు మించి అడ్వాన్సును అడగకూడదు. అంతేకాదు.. ఎవరైనా అద్దెదారు.. యజమానికి ఇంటిని ఖాళీ చేస్తామని చెప్పిన తర్వాత.. చెప్పిన సమయానికి ఖాళీ చేయకుంటే.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. రెండు నెలలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు..అద్దె ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలు కొత్త చట్టంలో ఉండనున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on October 15, 2020 10:52 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…