వివాహ వార్షికోత్సవం….ఏదైనా సంస్థ వార్షికోత్సవం….ప్రైవేటు పాఠశాలల వార్షికోత్సవం…ఇలా ఎన్నో రకాల వార్షికోత్సవాల గురించి విన్నాం. ఈ వార్షికోత్సవాలన్నీ సంతోషంతో జరుపుకునేవి. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు మాత్రం బాధతో ఓ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.
గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా మునిగిపోయిందని ఆ గ్రామస్థులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తమ గ్రామాన్ని సందర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాబోతున్నారని, వారు వస్తున్నారు…చూస్తున్నారు…వెళుతున్నారు….అని వ్యగ్యంగా ఊరి పొలిమేరలో బ్యానర్ కట్టారు ఆ గ్రామ ప్రజలు. ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమ గ్రామానికి ఇది 30వ వరద వార్షికోత్సవం అని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఈబీసీ కాలనీ వరదను తిలకించడానికి విచ్చేయుచున్న ప్రజా ప్రతినిధులకు ఇదే మా స్వాగతం అని ఆ ఊరి ప్రజలు కట్టిన బ్యానర్ ఇపుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులు వస్తున్నారు…. చూస్తున్నారు… వెళుతున్నారు…అంటూ గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ప్రజలు తమ బాధను, ఆవేదనను, నిరసనను వెటకారంగా వ్యక్తం చేశారు.
ఇకనైనా తమ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి, ఈ విషయంపై అక్కడి ప్రజాప్రతినిధుల స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. తెలంగాణలో ఓ ప్రజాప్రతినిధిపై కూడా ఇదే తరహాలో బ్యానర్ కట్టి ప్రజలు తమ నిరసన తెలిపారు. ఓ ప్రజాప్రతినిధి ఖరీదైన కారు కొన్నారని, అయితే, ఆ కారు నడిపేందుకు ఆ నేత ఉన్న ప్రాంతంలో రోడ్డు అనువుగా లేదని చెబుతూ ఓ బ్యానర్ కట్టారు. ఈ గుంతలు, గతుకులు ఉన్న రోడ్లో ఆ కారులో ప్రయాణిస్తే సదరు ప్రజాప్రతినిధికు నడుమునొప్పి వస్తుందంటూ వెటకారంగా బ్యానర్ రాశారు.
This post was last modified on October 14, 2020 11:04 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…