వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట తల పట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. అసలే సంక్రాంతి. ఆపై మిన్నంటుతున్న సంబరాలు. తన ఊరి పరిసరాల్లో తమిళనాడు తరహా జల్లికట్టు ఉత్సవాలు. ఊరూవాడా ఫుల్ జోష్ తో ఊగిపోతున్న వేళ… రోజాపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజిలో సాగుతోంది. రోజా చాలా స్పష్టంగా కనిపిస్తున్న సదరు వీడియోలను పోస్ట్ చేస్తున్న వైరి వర్గాలు, సామాన్య జనం… ఆ వీడియోల్లో రోజా చూపుతున్న ఉత్సాహాన్ని తప్పుబడుతూ ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారు వెరసి రోజాకు పండుగ సంబరమంతా ఆవిరైపోయిందనే చెప్పాలి.
అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మంది దాకా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు మొన్న వైసీపీ అధినేత జగన్ తిరుపతి వచ్చారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కూడా తరలివచ్చాయి. ఈ క్రౌడ్ కు సారథ్యం వహిస్తున్నట్లుగా రోజా ముందు వరుసలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లుగా నడిచారు.
ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే…అప్పటికే అక్కడ బాధితులను పరామర్శించి తిరిగి వెళ్లే క్రమంలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసిందో, ఏమో తెలియదు గానీ… ఆసుపత్రి ప్రాంగణం అని కూడా చూడకుండా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలను అందుకున్నాయి. ఇటా సాగుతున్న శ్రేణులకు ముందు నడిచిన రోజా… ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని సమీపిస్తున్న సమయంలో కూడా చేతులెత్తి మరీ జగన్ కు జై కొడుతూ సాగారు. ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్న నెటిజన్లు… అది ఆసుపత్రి అన్న కనీస అవగాహన కూడా లేకుండా ఆ అరుపులేంటి? అని రోజాను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పరామర్శకు వచ్చారా?.. బల ప్రదర్శనకు వచ్చారా? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
This post was last modified on January 11, 2025 12:20 pm
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…
రాయ్‌పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…