వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి శివారు ప్రాంతం చంద్రగిరి ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచిన చెవిరెడ్డి… ఆ తర్వాత జగన్ ఆదేశాల మేరకు చంద్రగిరిని తన కుమారుడికి వదిలేసుకుని తాను మాత్రం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పరాజయాన్ని చెవిరెడ్డి ఫ్యామిలీ చవిచూసింది. ఫలితంగా మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిన చెవిరెడ్డిపై ఇటీవల ఫొక్సో కేసు నమోదు అయ్యింది. తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రావారిపాలెం మండల పరిధిలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఘటనలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఆయనపై ఈ కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో తన తప్పేమీ లేదని ఆది నుంచి చెబుతున్న చెవిరెడ్డి… న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసినా… తాను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. న్యాయపోరాటంలో భాగంగా ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన హైకోర్టు.. శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ కేసును కొట్టివేయడం కుదరదంటూ చెవిరెడ్డికి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. అయినా కూడా చెవిరెడ్డిలో ఏమాత్రం ధైర్యం సడలనట్లే కనిపిస్తోంది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి… హైకోర్టులో తనకు న్యాయం జరగకుంటే… సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. కోర్టులో కేసుపై పోరాటం సాగిస్తానే తప్పించి… బెయిల్ అన్న మాటే ఎత్తనని ప్రతినబూనారు. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసిన చెవిరెడ్డి… ముందస్తు బెయిల్ కోసం కూడా తాను కోర్టులను ఆశ్రయించేది లేదని తేల్చి చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసినా తనకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఓ వైపు వరుసగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ముందస్తు బెయిళ్ల కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే.. చెవిరెడ్డి మాత్రం తనకు బెయిలే అక్కర్లేదని చెబుతుండటం గమనార్హం.
This post was last modified on January 10, 2025 7:08 pm
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…