Political News

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడిన నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గురువారం తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష తర్వాత ఘటనకు బాధ్యులుగా తేలిన ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఓ వైపు చంద్రబాబు తిరుపతిలో ఉండగానే… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎందుకనో గానీ.., చంద్రబాబు వద్దకు వెళ్లని పవన్… తనకు తానుగా… ప్రత్యేకంగా ఘటనా స్థలిని సందర్శించడంతో పాటుగా… స్థానిక జనసేన ఎమ్మెల్యే, నేతలను వెంటబెట్టుకుని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత స్విమ్స్ ఆసుపత్రి బయటకు వచ్చిన పవన్… అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనూహ్యంగా ఆయన క్షమాపణలు చెప్పారు. తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని పవన్ అన్నారు. తప్పు జరిగిపోయిందని, తమను క్షమించాలని పవన్ వేడుకున్నారు.

పవన్ నోట పబ్లిక్ గా సారీ అనే పదం వినిపించిందంటే… ఈ ఘటన ఆయనను ఎంత తీవ్రంగా కలచివేసిందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. ఏ అంశంపై అయినా సూటిగా తన మనసులోని భావనను వ్యక్తం చేస్తారని .పేరున్న పవన్…తిరుపతి ఘటనకు తాను బాధ్యత వహిస్తున్నట్లుగా తాను సారీ చెప్పడం నిజంగానే అక్కడి మీడియా ప్రతినిధులను షాక్ కు గురి చేసింది. ఇక ఆ తర్వాత ఘటన జరిగిన తీరును ప్రస్తావించిన పవన్… వెంకన్న దర్శనానికి వచ్చి భక్తులు మరణించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్పిన టీటీడీ ఈవో శ్యామలరావు గానీ, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గానీ ముందుకు రావడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వ్యవహారాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ఇద్దరు అధికారులు విఫలమయ్యారని పవన్ ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీ పాలకవర్గానికి, అధికార యంత్రాంగానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లుగా తనకు తెలిసిందని పవన్ అన్నారు. స్వామి వారి ఆలనాపాలనా చూసుకోవడానిక నియమితులైన రెండు విభాగాల మధ్య ఈ అంతరాలు, పొరపొచ్చాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రమాదంపై ఎవరికి వారు దాటవేత ధోరణి అవలంభించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా స్వామి వారి దర్శనం విషయంలో ముందుగా సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం దక్కేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో దేవుడి దర్శనం కోసం వచ్చే వారు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.

This post was last modified on January 9, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

15 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

21 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

24 minutes ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

5 hours ago