Political News

భారత్ పోల్ తో అంతర్జాతీయ నేరస్తుల ఆటకట్టు

మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు.

జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం, వారి కదలికలపై ఓ కన్నేసి వారిని పట్టుకోవడం లక్ష్యంగా భారత్ పోల్ పోర్టల్ ను సీబీఐ రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ద్వారా భారత దేశపు పోలీసులు క్రిమినల్ రికార్డులను చిటికెలో అప్‌లోడ్ చేయవచ్చు.

ఆ అప్ లోడ్ అయిన వివరాలతో ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ నేరగాళ్లు ఏ దేశంలో దాక్కున్నా సరే వారిని కలుగులో నుంచి బయటకు తెచ్చేందుకు భారత్ పోల్ ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం కాక ముందు మన దేశంతోపాటు విదేశాలకు పారిపోయిన నేరస్థుల సమాచారం సేకరించడం, అరెస్టు చేయడం ఓ పెద్ద ప్రహసనం.

ఆ నేరస్తుల సమాచారం కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరుగా ఇంటర్‌పోల్‌ ను ఆశ్రయించాల్సి ఉండేది. అందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సీబీఐని సంప్రదించి…ఆ తర్వాత సీబీఐ వెళ్లి ఇంటర్‌పోల్‌ను సంప్రదించి…అప్పుడు నోటీసులు జారీ అయ్యేవి. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న రీతిలో చాలామంది నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేస్తుంటారు.

అయితే, ఇకపై వారికి ఆ చాన్స్ ఉండదు. భారత్ పోల్ టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేరుగా భారత్‌పోల్‌తో కనెక్ట్ అవుతారు. నేరగాళ్ల సమాచారం కోసం భారత్‌పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్‌ ను సంప్రదిస్తారు. ఇంటర్‌పోల్ ఆ అభ్యర్థనకు ఒప్పుకుంటే సదరు నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర నోటీసులు వెంటనే జారీ చేస్తుంది.

ఇంటర్‌పోల్‌తో ఫాస్ట్ గా కమ్యూనికేట్ కావడం, ఆ తర్వాత వెంటనే నోటీసులు జారీ అయ్యేలా చేసి నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవడం భారత్ పోల్ పోర్టల్ లక్ష్యం.

This post was last modified on January 7, 2025 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…

2 hours ago

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలోని మిగతా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు..దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తు.…

2 hours ago

వింటేజ్ వెంకీని తెలివిగా వాడుకున్నారు

జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని వదలకుండా పబ్లిసిటీ విషయంలో దర్శకుడు…

2 hours ago

కంపెనీని అమ్మేస్తే రూ.8 వేల కోట్లు వచ్చాయి.. యువకుడి పోస్టు వైరల్

అతడి వయసు 35 ఏళ్ల కంటే తక్కువే. అయితే.. టెక్నాలజీ మీద తనకున్న పట్టుతో ఈ భారత సంతతికి చెందిన…

2 hours ago

పదేళ్ల తర్వాత భలే మంచి ‘జి2’ ఛాన్స్

సోషల్ మీడియా, సినిమా సెలబ్రిటీలను బాగా ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు వామికా గబ్బి. ఇటీవలే వరుణ్ ధావన్…

2 hours ago

ఎలాన్ మస్క్ పై బ్రిటన్ ప్రధాని ఫైర్!

ఒకప్పుడు రవి ఆస్తమించని బ్రిటన్ సామ్రాజ్యంగా పేరున్న ఇప్పటి గ్రేట్ బ్రిటన్.. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటివరకు…

3 hours ago