Political News

చంద్ర‌బాబు సూప‌ర్‌ విజ‌న్‌.. జ‌గ‌న్ ది డెట్ విజ‌న్‌!: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌దేన‌ని చెప్పారు. “చంద్ర‌బాబుగారు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కాలంలో వేసిన అడుగులు పెట్టుబ‌డులు తెచ్చాయి. ఉపాధి క‌ల్పించాయి. ఉద్యోగాలు సృష్టించాయి. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. హైద‌రాబాద్ చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. కానీ, జ‌గ‌న్ పాల‌న త‌ర్వాత‌.. అప్పుల‌కు వ‌డ్డీలు.. వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వ‌చ్చింది. ఇది జ‌గ‌న్ విజ‌న్‌” అన్నారు.

తాజాగా సోమ‌వారం నారా లోకేష్.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత రం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం నెల‌కు రూ.4 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. అయితే.. అంత మేర‌కు ఆదాయం రావ‌డం లేద‌ని.. దీనికి తోడు జ‌గ‌న్ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. “చంద్ర‌బాబు ఈ రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించేందుకు సూప‌ర్ విజ‌న్ అమ‌లు చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

కానీ, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. కూడా విజ‌న్‌ను అనుస‌రించార‌ని.. కానీ, అది డెట్ విజ‌న్‌(అప్పుల విజ‌న్‌) అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ‌చ్చే 25 ఏళ్ల‌పాటు మ‌ద్యాన్ని తాక‌ట్టు పెట్టార‌ని, ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టారని.. ఈ సారి కూడా అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. ప్ర‌జ‌ల‌ను కూడా తాక‌ట్టు పెట్టి మ‌రీ అప్పులు తెచ్చి ఉండేవార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డానికి జ‌గ‌న్ డెట్ విజ‌నే కార‌ణ‌మ‌ని అన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు స‌హా మంత్రి వ‌ర్గంలో అన్ని విష‌యాల్లో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్పా రు. అందుకే.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. 1వ తేదీ కి ముందుగానే పింఛ‌న్లు, వేత‌నాలు అందిస్తున్నామ న్నారు. అదేవిధంగా వ‌చ్చే మూడు మాసాల్లో 10 వేల మందికి ఉపాధి క‌ల్పించే దిశ‌గా ప‌లు కంపెనీల‌ను కూడా ఆహ్వానించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే రాష్ట్రం పురోగ‌తి దిశ‌గా అడుగులు వేస్తుంద‌న్నారు.

This post was last modified on January 6, 2025 6:31 pm

Share

Recent Posts

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

10 minutes ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

14 minutes ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

30 minutes ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

52 minutes ago

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

2 hours ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

2 hours ago