ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం కూటమికి కుంపటి పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. తాజాగా ఆయన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. మహిళా నాయకుల విమర్శలపై ప్రతి విమర్శలు చేశారు.
దీనిపై తీవ్ర రగడ చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం స్పందించారు. దీంతో విషయం సీరియస్ అవుతున్నట్టు గ్రహించిన జేసీ.. నాలుగు మెట్లు దిగి వచ్చారు. తొలిసారి ఆయన క్షమాపణలు కోరుతూ.. బీజేపీ నాయకురాలు, నటి మాధవీలతకు విన్నవించారు. “తొందరపడ్డాను, ఆవేశంలో ఏదో అన్నాను. ఇది సరికాదు. సారీ“ అంటూ.. ముక్తాయించారు. దీంతో వివాదం దాదాపు సర్దు మణిగిందనే అంటున్నారు పరిశీలకులు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన జేసీ.. “నేను మాధవిలత మీద టంగ్ స్లిప్ అయ్యాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా“ అని వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తపన పడుతున్నట్టు వెల్లడించారు. తాడిపత్రి ప్రజలే తనకు సైన్యమని వివరించారు. నియోజకవర్గం కోసం తాను పోరాడుతున్నానని.. అంతకు మించి వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.
ఇక, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలపైనా జేసీ స్పందించారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారేది లేదన్నారు. చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ విజయం సాధించారని, ఆయన వెంటే తాను నడుస్తానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని.. తాను తాడిపత్రి కోసం కష్టపడుతున్నానని వ్యాఖ్యానించారు. దీనిలో వేరే నాయకుల ప్రమేయం వద్దని ఆయన పరోక్షంగా సూచించారు.
This post was last modified on January 5, 2025 7:56 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…