తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో చర్యలకు దిగారు.
శనివారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీని పరిశీలించిన.. రంగనాథ్.. ఆ వెంటనే ఆదివారం కూల్చి వేతలకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనాన్ని కూల్చి వేస్తున్నారు.
వాస్తవానికి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఇప్పుడు కొత్తకాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఒకటి రెండు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి.
అయినా.. అయ్యప్ప సొసైటీ తీరు మారడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలోనే శనివారం రంగనాథ్ క్షేత్రస్తాయిలోకి దిగి పరిశీలన చేశారు. అనంతరం.. ఆక్రమనలు నిజమేనని నిర్దారించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూల్చివేతలకు రెడీ అయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం.. సంచలనం గా మారింది. ఇక, ఈ ఆక్రమణ తాలూకు భవనం రోడ్డుకు ఆనుకుని ఉండడంతో సమీపంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు.
This post was last modified on January 5, 2025 5:04 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…