దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా
అని నోరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు
అని మనసా వాచా నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏం చేశారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 97 లక్షలపైచిలుకుకు చేరుకుంది. మరో నెల రోజుల్లో మరో 3 లక్షల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్
, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్
ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన అంశం.
దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీలకు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబ్బరంగా ఉండాలని.. ఆ కార్యకర్త కుటుంబం కూడా పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏంటి ప్రయోజనం..
This post was last modified on January 3, 2025 8:11 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…