వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్యరమైన పోస్టులు పెట్టారని కేసులు నమోదైన సంగతి తెలిసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వ్యక్తిత్వ హననానికి అనిల్ పాల్పడిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే అనిల్ పై పలు కేసులు నమోదు కాగా..ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో అనిల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కానీ, అనిల్ కు షాకిస్తూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అనిల్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనిల్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. ఇటువంటి వారిని క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడింది. అందుకే, అతడికి బెయిల్ మంజూరు చేయడం లేదని తేల్చి చెప్పింది.
కాగా, గుంటూరులోని అరండల్ పేట్ లో ఉన్న ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకాష్ ను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్నారు. ఆ కేసులో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
This post was last modified on January 2, 2025 12:47 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…