Political News

2025: చంద్ర‌బాబు డైరీ ఫుల్‌!

నూత‌న సంవ‌త్స‌రం-2025 వ‌చ్చేసింది. ఎన్నో ఆశ‌లు.. ఎన్నెన్నో ఆశ‌యాల‌తో కొంగొత్త సంవ‌త్స‌రం ఆవిష్కృత‌మైంది. ఏ సంవ‌త్స‌రానికైనా 365 రోజులు ఉన్న‌ట్టుగానే.. 2025లోనూ అన్నేరోజులు ఉంటాయి. కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఈ రోజులు అన్నీ చాలా డిఫ‌రెంట్‌. ఏ రోజూ.. మునుప‌టి సంవ‌త్స‌ర‌పు రోజుల మాదిరిగా ఉండే అవ‌కాశ‌మే లేదు.

దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు! ప్ర‌తిరోజూ పండ‌గే అన్న త‌ర‌హాలో ఏపీని వ‌డివ‌డిగా అడుగులు వేయించేలా చంద్ర‌బాబు 2025 డైరీలో ప్ర‌తి రోజునూ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తీర్చిదిద్దుకున్నారు. ఏ ప‌నులు ఎప్పుడు ప్రారంభించాలో.. ఏయే ప‌నుల‌కు శ్రీకారం చుట్టి పూర్తి చేయాలో ఆయ‌న నిర్దేశించుకున్నారు.

దీంతో చంద్ర‌బాబు 2025 డైరీలో ప్ర‌తిపేజీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో నిండిపోయింది. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల వ‌ర‌కు.. అనేక కార్య‌క్ర‌మాలు ఈ డైరీలో నిక్షిప్త‌మ‌య్యాయి. ప‌క్కా ప్ర‌ణాళిక‌, ముందు చూపు, నిధుల సేకర‌ణ‌.. వంటివాటికి బ‌హుముఖ రీతుల్లో ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు.

ప‌క్కాగా అమ‌లు చేసేలా యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేసుకున్నారు. ఒక్క ఈ ప‌నులు మాత్ర‌మే కాదు.. అధికారుల్లో చైత‌న్యం క‌లిగించ‌డం నుంచి జిల్లాల‌ప‌ర్య‌ట‌న దాకా.. అన్నీ నిర్దేశించుకున్నారు. న‌వ్యాంధ్ర‌లో రెండో సారి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. గ‌తానికి భిన్నంగా ఆరు మాసాల పాటు.. పాల‌న‌పై ప‌ట్టు సాధించేందుకే ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌తువు పూర్త‌యింది. ఆయ‌నే చెప్పిన‌ట్టు.. ఆర్థిక వ్య‌వ‌స్థ నుంచి అన్ని వ్య‌వ‌స్థ‌ల‌నూ ప‌ట్టాలెక్కించారు. ఒక‌టి రెండు మిన‌హా మిగిలిన వ్య‌వ‌స్థ‌లు ప‌క్కాగా ప‌ట్టాలెక్కాయి. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. తెలిసేలా యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసుకున్నారు. దీనిలో కీల‌క‌మైన డ్యాష్ బోర్డును జ‌న‌వ‌రి నుంచి అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు.

అదే విధంగా మంత్రుల‌పైనా ప్ర‌తి రోజూ.. ప‌ర్య‌వేక్షణ‌కు వారి హాజ‌రు తీసుకుంటారు. కేవ‌లం ఆఫీసుల‌కే ప‌రిమితం కాకుండా.. స‌మీక్ష‌ల‌కే స‌మ‌యాన్ని కేటాయించ‌కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించుకున్నారు. పాల‌నా ప‌ర‌మైన అన్ని వ్య‌వ‌హారాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకునే వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ఠం చేశారు. ఇలా.. 2025 చంద్ర‌బాబు డైరీ.. వినూత్న వైవిధ్య పాల‌నా ప‌నుల‌తో నిండిపోయింది.

This post was last modified on January 1, 2025 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిల్ రావిపూడి చూపించే చిరంజీవి ఎలా ఉంటాడంటే

టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…

2 hours ago

నిజం కాబోతున్న శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…

2 hours ago

డబుల్ బొనాంజా కొట్టేసిన అంజలి

కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…

4 hours ago

USA: భారతీయులను భయపెడుతున్న ఓపీటీ రచ్చ

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్‌1బీ వీసాలు పొందేందుకు ఈ…

4 hours ago

వరుస ఫ్లాపులు.. అయినా చేతిలో 4 సినిమాలు

టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్…

5 hours ago

జేసీ కామెంట్లపై తగ్గేదేలే అంటోన్న మాధవీ లత

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల…

5 hours ago