మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్టు అయ్యారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఏపీకి సంబంధం లేని సదూర రాష్ట్రమైన అసోంలో ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడైన కాళీ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఆయన ఆచూకీ లభించని పరిస్థితి. తాజాగా అసోంలో ఉన్నట్లుగా సమాచారం అందటంతో అక్కడకు వెళ్లి మరీ అరెస్టు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడితో పాటు.. టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఉదంతంలో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పదమూడు మంది అరెస్టు అయ్యారు. వీరంతా వైసీపీ కార్యకర్తలే కావటం గమనార్హం. వీరిని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. వారికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకీ ఈ దాడి ఉదంతం ఎప్పుడు చోటు చేసుకుందన్న వివరాల్లోకి వెళితే.. 2022 డిసెంబరు 26న పలుచోట్ల టీడీపీ నేతలు గుడివాడలో వంగవీటి రంగా వర్థంతిని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.డిసెంబరు 25న టీడీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసిన కాళీ.. రంగా వర్ధంతిని టీడీపీ ఆధ్వర్యంలో చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
అయితే.. ఆ హెచ్చరికలకు బదులుగా.. ఎట్టి పరిస్థితుల్లో వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పగా.. రావిని చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అనంతరం రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై 2022 డిసెంబరు 25న కొడాలి అనుచరులు పెట్రోల్ పాకెట్లతో దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవటంతో టీడీపీ తగలబడే ప్రమాదం తప్పింది. ఈ ఉదంతంపై అప్పట్లో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఎలాంటి ఫలితం లేని పరిస్థితి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి కొడాలి కాళీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పలువురి మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే పదమూడు మంది అనుచరులు అరెస్టు కాగా.. తాజాగా అసోంలో కాళీ అరెస్టు అయ్యారు. ఈ వ్యహారంలో మాజీ మంత్రి కొడాలి నాని పాత్ర ఏమైనా ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
This post was last modified on December 31, 2024 5:39 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…