వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫైరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్టమని ఆయనకు ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంట్లో ఆడవాళ్లతో గోదాములు నిర్మించారని.. ఇప్పుడు మళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నారని అన్నారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పేర్ని నాని తప్పులు చేశారని.. ఆ తప్పులే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగాయని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడారని.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని దుయ్యబట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేదన్నారు.
బేరీజు వేయండి!
ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ గట్టి సవాలే విసిరారు. గతంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాలనను.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆరు మాసాల పాలనను బేరీజు వేయాలని ఆయన సవాల్ రువ్వారు. వైసీపీ పాలన కంటే వంద రెట్లు ఎక్కువగా తమ పాలన బాగుందన్నారు. ఇప్పటి వరకు వ్యవస్థలను సంస్కరించామని, వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగు చేశామని.. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
“మేం పదవులు అనుభవించడం లేదు. పనిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్యతతో పనిచేస్తున్నాం. మా ఆరు నెలల పాలనకు, వైసీపీ ఆరు మాసాల పాలనకు మధ్య నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గ్రామాలను సస్యశ్యామలం చేయాలని కలలు కంటున్నారని ఆదిశగా మన రాష్ట్రంలోనూ అభివృద్దిపనులు చేపడతామని పవన్ కల్యాణ్ చెప్పారు.
This post was last modified on December 30, 2024 3:55 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…