Political News

‘ప‌ల్లె పండుగ ‘తో ప‌వ‌న్ మైలేజీ.. ఎలా ఉందో తెలుసా ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయ‌న క‌న్నేశార‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండ‌గా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైనా.. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవ‌న్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా ద‌క్కిన‌వే.

ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగ‌లు వేస్తున్నారు. ప‌ల్లె ప్రాంతాల్లో ప‌ట్టు పెంచుకునే దిశ‌గా ఆయ‌న వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. మ‌రీముఖ్యంగా ప‌ల్లెల్లో ఏళ్ల త‌ర‌బ‌డి ర‌హ‌దారి సౌక‌ర్యం లేక పోవ‌డం.. ఇంటింటికీ కుళాయి సౌక‌ర్య లేని వైనంపై ఆయ‌న యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధుల‌ను నేరుగా అక్క‌డ‌కే మ‌ళ్లిస్తున్నారు.

ప‌ల్లె పండుగ‌-పేరులో గ్రామీణ‌, మ‌న్యం ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అర‌కు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజ‌న ఆవాసాల‌కు నిర్మిం చిన ర‌హ‌దారులు.. అక్క‌డ ప‌వ‌న్ ఇమేజ్‌ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … ప‌వ‌న్‌కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ర‌హ‌దారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి మ‌న్యం ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. అదేవిధంగా.. ర‌హ‌దారుల నిర్మాణాల‌ను అధికారుల‌కు అప్ప‌గించినా.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప‌రిశీలిస్తున్నారు. ఇవ‌న్నీ కూడా.. ప‌నులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా స‌హ‌క‌రిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు..ఆటోమేటిక్‌గానే ప‌వ‌న్‌కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేస‌మ‌యంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. క‌దిలించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నాయి.

This post was last modified on December 27, 2024 9:23 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

కెజిఎఫ్ హీరోయిన్ దశ తిరుగుతోంది

ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…

52 minutes ago

సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…

2 hours ago

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…

3 hours ago

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

4 hours ago

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…

5 hours ago

హీరోలు సాధార‌ణ మ‌నుషులే.. మ‌రిచిపోతున్నారు: త‌మ్మారెడ్డి

ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఆయ‌న ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడ‌తారు.. ఏం…

5 hours ago