రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిని పక్కన కూడా పెట్టేస్తారు. కానీ, తమిళనాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా భీషణ ప్రతిజ్ఞే చేశారు. పట్టుమని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను చెప్పులు వేసుకునేది లేదని సంచలన ప్రతిజ్ఞ చేయడం గమనార్హం.
ఎవరీ అన్నామలై?
వాస్తవానికి ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. కర్ణాటకలో ఎస్పీగా పనిచేశారు. అయితే.. అక్కడే ఆయన బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే సొంత రాష్ట్రానికి వచ్చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే సాగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఆయనకు రాజకీయంగా బీజేపీలో తిరుగులేకుండా పోయింది. ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారిని పక్కన పెట్టి మరీ ఆయనను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను చేశారు.
ప్రతిజ్ఞ ఎందుకు?
తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ఉండే అన్నామలై.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోని లోపాలను బాగానే ఎండగడుతున్నారు. తాజాగా అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై.. అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించి డీఎంకే సర్కారుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఈ క్రమంలోనే అన్నామలై.. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని.. ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని.. డీఎంకే సర్కారు అంతమై పోవాలనికూడా అన్నామలై చెబుతున్నారు. డీఎంకే సర్కారును గద్దె దింపి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తాను చెప్పులు ధరించే ది లేదని ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలనను నిరసిస్తూ.. కొరడా దెబ్బలు తింటానని.. మురుగన్(కుమారస్వామి) ఆలయాలను దర్శిస్తానని 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని కూడా.. చెప్పుకొచ్చారు. మరి ఇవి ఆయనకు, బీజేపీకి ఏ మేరకు మైలేజీ తెస్తాయో చూడాలి.
This post was last modified on December 26, 2024 11:47 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…