కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని కొన్ని విషయాల్లో అసంతృప్తులు.. అలకలు ఉన్నాయి. అయితే.. ఎవరూ బయటకు చెప్పరు. అలాగని అంతర్మథనంతో వదిలేయరు. రాజధానికి నిధులు, పోలవరానికి నిదులు, అభివృద్ధి నిధులు వంటివి మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. వీటిపైనే ఎప్పుడూ చర్చిస్తున్నారు. అయితే.. ఇప్పటికి ఆరు మాసాలు గడిచిపోయిన తర్వాత.. ప్రజలకు చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మనసులోని మాటను ప్రధాని మోడీకి వివరించారని తెలిసింది. తాజాగా ఆయన ఢిల్లీలో పర్యటించారు. వాజపేయి శత జయంతి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం దాదాపు గంటకుపైగానే ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరు మాసాల ఏపీ పాలన, పథకాలు.. కేంద్రం నుంచి వచ్చే సొమ్ములు, రావాల్సిన సొమ్ములపైనా ఇరువురు నాయకులు కూడా చర్చించుకున్నా రు. ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని.. ప్రధాని మోడీ మరోసారి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే.. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి కీలకమైన రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు మోడీ ముందు చెప్పుకొచ్చినట్టు సమాచారం. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం వంటివి అమలు చేయాలని నిర్ణయించామని.. ఇవి కూటమి పార్టీల తరఫున తామే ఇచ్చిన హామీలుగా ఆయన చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించి సగం మీరూ పంచుకోవాలని.. ఆయన అభ్యర్థించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మహారాష్ట్రలో ‘బేటీ బెహెన్’ పథకానికి కేంద్రం 40 శాతం నిధులు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసినట్టు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం పుంజుకునేందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుందని.. దీనిలో కొన్నింటిని కేంద్రం కూడా.. ఏదో ఒక రూపంలో(పద్దు) ఆదుకోవాలని.. ఆయన కోరినట్టు సమాచారం. మహిళలకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులపై పన్నుల మినహాయిం పును కోరినట్టు తెలిసింది. తద్వారా.. రాష్ట్రంపై 100 కోట్ల భారం తగ్గనుంది.
అదేవిధంగా జీఎస్టీలో 1 శాతం అదనంగా తమకు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. అయితే.. దీనిపై ప్రధాని మౌనంగా ఉన్నారని.. కూటమి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 26, 2024 10:14 am
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…