రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన నోటి నుంచి ఏది వచ్చినా.. చాలా వాల్యుగా ఉంటుంది. పైగా.. ఆయన చెప్పింది.. బీజేపీకి వేదంగా కూడా భావిస్తారు. అలాంటి భాగవత్ నోటి నుంచి “మసీదులు-మందిరాల రగడ వద్దు” అని రావడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అయితే..ఇది నిజంగానే ఆయన మనసులోని మాటేనా? అనేది కూడా సందేహం.
ఎందుకంటే.. ఆర్ ఎస్ ఎస్ అంటేనే హిందూవాదం.. కట్టుబొట్టు! రామ జన్మభూమి ఉదంతాన్ని భుజాన వేసుకుని ముందుకు సాగారు. అంతేకాదు.. మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం అంటూ.. పిటిషన్లు వేసింది కూడా.. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే. అయితే.. ఇలాంటి నాయకత్వం వహిస్తున్న మోహన్ భగవత్ .. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. సమ్మిల సమాజం, సామరస్యం అంటూ.. పెద్ద లెక్చరే ఇచ్చారు. అంటే.. ముస్లింలు, హిందువులు కలిసి కట్టుగా ఉండాలన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
కానీ, ఇంత పెద్ద హిందూవాది.. ఒక్కసారిగా ఇలా వ్యాఖ్యానించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ విషయంలో మోడీపై ఆయనకు ఉన్న అక్కసు.. ఆగ్రహం వంటివి బయపడుతున్నాయన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన నాటి నుంచి కూడా బీజేపీ తన పంథాను ప్రత్యేకంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అంటే.. ఆర్ఎస్ఎస్ అడుగు జాడలను దాదాపు పక్కన పెట్టింది. ఈ క్రమంలో మోడీపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ వాదులను దాదాపు పక్కన పెట్టడం కూడా.. వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే చాలా వ్యూహాత్మకంగా మోహన్ భగవత్ వ్యవహరించారన్న చర్చ సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నాయకుడే ఇలా.. సామరస్యం సమ్మిళిత సమాజం కోసం.. ప్రయత్నిస్తే.. ఇక, బీజేపీ మరింత కిందికి దిగాలి. కానీ, యూపీలో జరుగుతున్న పరిణామాలు.. అక్కడి సంభాల్ ప్రాంతంలో ఉన్న మసీదును కూల్చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న సమయంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో సహజంగానే బీజేపీ ఇరుకున పడడం ఖాయం. మరి దీనిని లైట్ తీసుకుంటారో.. లేక ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 21, 2024 5:59 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…