సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. యూత్ ని కూడా ఎట్రాక్ట్ చేసేలా మాట్లాడగలరు. గతంలో జనసేన లో ఉన్న లక్ష్మీనారాయణ మళ్ళీ పవన్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం సొంతంగా పార్టీ పెట్టి గ్రామా స్థాయి లెవెల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
ఇక పార్టీ పెట్టినా కూడా ఆయన విపక్షాల తరహాలో ఎల్లప్పుడూ విమర్శలు చేయకుండా మంచి పనులు చేసినప్పుడు ప్రభుత్వంపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కూడా ఇటీవల ప్రశంసలు కురిపించడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో పర్యటనతో పవన్ గిరిజన అభివృద్ధి అంశాన్ని ముందుకు తెచ్చారు.
బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా గ్రామ అభివృద్ధికి తన కట్టుబాటును చాటారు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లక్ష్మీనారాయణ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించినందుకు పవన్‌ను అభినందించారు.
గిరిపుత్రుల అభివృద్ధి కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. “రాజ్యాంగంలోని 46, 244, 244ఏ, 275(1) అధికరణలు గిరిజనుల హక్కులను పరిరక్షించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో మీ నాయకత్వం కీలకంగా ఉంటుంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పొగడ్తలు చూస్తుంటే మళ్ళీ ఆయన జనసేనకు దగ్గరవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ కూడా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక నెటిజన్లు చేసే కామెంట్స్ కూడా దరిచేరకుండా కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు.
This post was last modified on December 21, 2024 3:20 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…