Political News

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ కేసు విషయం తెలుసుకన్న కేటీఆర్ సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసింగ్ లో కుంభకోణం అని ఆరోపిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో ఆ అంశంపై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఆ అంశంపై చర్చ పెట్టాలని, సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

ఇక, కేటీఆర్ పై కేసు నమోదు కావడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే ఇలా కేసులు పెడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మితే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ కూడా రాశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని, కేబినెట్ లో కాదు…అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

తెలంగాణ, హైదరాబాద్‌కు మంచి జరగాలని 2023లో రేస్‌ను విజయవంతంగా నిర్వహించామని, ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరినందని నీల్సన్ సంస్థ నివేదిక ఇచ్చిందని లేఖలో రాశారు. ఈ ఏడాది జరగాల్సిన రేస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతో రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on December 19, 2024 11:02 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

22 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

59 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago