పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆ ఎంపీ నా మీదకు వచ్చి పడ్డాడు. అదే సమయంలో నేనూ కిందపడి గాయపడ్డాను,” అని ఆరోపించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, రాహుల్ గాంధీ తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన మాట్లాడుతూ, “సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మా తప్పేమీ లేదు,” అని స్పష్టం చేశారు. ఆయన వీడియో ఫుటేజీ పరిశీలించి నిజాలు బయటపెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాహుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ ఘటనతో పార్లమెంట్ వేదిక మరింత వివాదాస్పదంగా మారింది.
This post was last modified on December 19, 2024 1:43 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…