జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర సర్కారుకు.. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కీలక పార్టీ టీడీపీ నుంచి కొంత వ్యతిరేకత.. అదేసమయంలో విన్నపాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. జమిలి ఎన్నికలను 2029లో నిర్వహించాలని చంద్రబాబు కోరుతున్నారు. తద్వారా.. కూటమి సర్కారుకు దక్కిన ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కానీ, కేంద్రం తీసుకువస్తున్న జమిలి బిల్లు కనుక ఆమోదం పొందితే.. 2027-28 మధ్యలోనే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఇది కూటమి సర్కారుకు ఏపీలో శరాఘాతంగా మారనుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం సగం కూడా పూర్తయ్యే అవకాశం లేదు. ఇక, పోలవరం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
ఇది పరోక్షంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందన్నది సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జమిలి వచ్చినా.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయన చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలి తీసుకువస్తే.. ఆయన కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా.. కేంద్రానికి విన్నవించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికిప్పుడు జమిలితో ఇరు పక్షాలకు ఇబ్బందేనన్నది చంద్రబాబు మాట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని.. ఆయన విన్నవించారు. అయితే.. తాము జమిలికి వ్యతిరేకం కాదని.. కానీ, సమయం సందర్భం మాత్రం ఇది కాదన్నది ఎన్డీయే పక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన మేలిమి సూచనగా.. జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని భావించినా.. కాంగ్రెస్‌పై సింపతీ పవనాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని.. కాబట్టి జమిలి తీసుకువచ్చినా.. 2029 వరకువెయిట్ చేయాలన్నది చంద్రబాబు సూచన. ఈ క్రమంలోనే మోడీ సర్కారు కూడా.. ఈ దఫా బిల్లును వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించడం లేదని జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 16, 2024 1:02 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…