ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం అప్పగిస్తే బాధ్యతతో వ్యవహరించకుండా.. అరాచకంగా పాలించి మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఎన్నో ప్రజలు కళ్లతో చూశారు. వాళ్లు చూడని దారుణాలు ఎన్నో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన రోడ్లు వేయకుండా కోట్లాది మందికి నరకం చూపించిన ఘనత జగన్ సర్కారుకే చెందుతుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా రోడ్లను పట్టించుకోలేదు.
ఇక మారుమూల గ్రామాలు, గిరిజన తండాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్న ఈ రోజుల్లో కూడా డోలీలు పట్టుకుని గర్బిణీలను నదులు దాటించి ప్రసవాల కోసం తీసుకెళ్లాల్సిన దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి.
ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తాజాగా ఓ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా డోలీలు కట్టి గర్భిణీలను తీసుకెళ్తున్న విషయం తెలిసి తాను ఎంతో బాధ పడ్డానని.. ఏం చేసైనా పర్వాలేదు గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేద్దాం అని తాను మీటింగ్ పెట్టి అధికారులను ప్రతిపాదనలు కోరానని.. ఐదే రాష్ట్ర వ్యాప్తంగా 2850 దాకా గిరిజన గ్రామాలున్నాయని.. వీటన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పించాలంటే 3 వేల కోట్లు ఖర్చవుతుందని వాళ్లు చెప్పారని పవన్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రతిపాదన పెడితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని.. ఆయన పరిస్థితి కూడా జనాలకు తెలియాలని.. ఖజానాలో డబ్బులు లేవని పవన్ అన్నారు. గత ప్రభుత్వం డబ్బులంతా ఏం చేసిందా అని చూస్తే.. రుషికొండలో భవనం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారని.. అలాగే జగన్ బొమ్మలతో నంబర్ రాళ్లు వేసేందుకు 1209 కోట్లు ఖర్చయ్యాయని తెలిసిందని పవన్ వెల్లడించారు. ఈ 1700 కోట్లు ఉంటే 1400 గిరిజన గ్రామాలకు రోడ్లు పూర్తయ్యేవని.. ఇదేం బాధ్యతారాహిత్యమని పవన్ ప్రశ్నించారు. ఎలాగైనా ఈ గ్రామాలకు రోడ్లు వేయించడానికి చూస్తానని పవన్ హామీ ఇచ్చారు.
This post was last modified on December 15, 2024 5:03 pm
బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…
ధనుష్, నాగార్జున కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఎడిటింగ్…
ఇంకో వారం రోజుల్లో నాని కొత్త చిత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా రిలీజ్కు రెడీ చేసేలోపే ఇంకో…
టీడీపీ నిర్వహించ తలపెట్టిన మహానాడు ఈ దఫా పంబరేగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జగన్…
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న…
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ మారణ హోమం.. దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్రవాదానికి చాలా మటుకు…