Political News

బాబు ముందు బిగ్ టాస్క్‌.. మోడీ ఏం చేస్తారు ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌కు తానే బిగ్ టాస్క్ పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర పాల‌న‌పైనే దృష్టి పెట్టిన ఆయ‌న తాజాగా దివంగ‌త ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న వ‌చ్చేలా చేస్తాన‌ని వాగ్దానం చేశారు. తాజాగా విజ‌య‌వాడ శివారు కానూరులో నిర్వ‌హించిన ఎన్టీఆర్ వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడో భార‌త ర‌త్న రావాల్సి ఉంద‌ని, కానీ రాలేద‌ని.. ఇప్పుడు దానిని తాము సాధిస్తామ‌ని చెప్పారు. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు ఏ ర‌కంగా దీనిని సాధిస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.

కేంద్రంతో చ‌ర్చిస్తే త‌ప్ప‌.. కేంద్రం ఒప్పుకొంటే త‌ప్ప‌.. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే రెండు సార్లు ఈ విష‌యంలో ఆయ‌న కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రి ప్ర‌య‌త్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆమె ప్ర‌య‌త్నించారు. అయితే.. అప్ప‌ట్లోనే రావాల్సిన భార‌త ర‌త్న అనూహ్యంగా వెన‌క్కి వెళ్లిపోయింది. దీనికి కూడా కార‌ణాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ అప్ప‌ట్లో తెర‌మీదికి వ‌చ్చింది.

విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేస్తే.. త‌మ‌కు కూడా అమ‌లు చేయాల‌ని.. ప్ర‌త్యేక‌హోదా ఏపీకి ఇస్తే.. త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని పొరుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న‌ట్టుగానే ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న అవార్డు ప్ర‌క‌టిస్తే.. త‌మ‌కు కూడా.. ఇవ్వాలంటూ.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసిన‌ట్టు అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. త‌మిళ‌నాడు న‌టుడు, ఏఐఏడీఎంకే.. ఒక‌ప్ప‌టి సార‌ధి.. ఎంజీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌న్న‌ది అప్ప‌ట్లో తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌ధాన డిమాండ్‌.

ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం.. ఎవ‌రికీ ఇవ్వ‌కుండా.. ఈ విష‌యంలో తాత్సారం చేసింది. ఇప్పుడు . కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో కొంత వ‌ర‌కు ఈ విష‌యంలో అడుగులు ముందుకు ప‌డే అవ‌కాశం ఉంది. కానీ, ఇదేస‌మ‌యంలో ఏఐఏడీఎంకే కూడా.. ఎన్డీయే మిత్ర ప‌క్ష‌మే. కాబ‌ట్టి గ‌త డిమాండ్ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇస్తే..ఇరు రాష్ట్రాల‌కు భార‌త‌ర‌త్న‌ను ప్ర‌క‌టించాలి. లేక పోతే.. సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు పెట్టుకున్న బిగ్ టాస్క్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on December 15, 2024 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌వ‌న్ టార్గెట్ @ జ‌న‌వ‌రి 14!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జ‌న‌వ‌రి 14 వ‌తేదీ క‌ళ్ల ముందే క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యానికి ఆయ‌న పెట్టుకున్న టార్గెట్…

12 mins ago

మెగాస్టార్ ని కలిసిన ఐకాన్ స్టార్ !!

సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి కోర్టు కేసు ఎదురుకుని బెయిల్ మీద బయటికి వచ్చిన అల్లు అర్జున్ నిన్నంతా తన…

15 mins ago

ఘాటీ డేట్ వచ్చింది… కొత్త డౌట్లు తెచ్చింది!

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఘాటీ రిలీజ్ డేట్ అధికారికంగా చెప్పేశారు. ఏప్రిల్ 18 ప్యాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో…

42 mins ago

హమ్మయ్యా…..అఖిల్ 6 మొదలైపోయింది!

గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరిపినిచ్చాడు. ఇవాళ కొత్త సినిమా…

1 hour ago

3D పుష్పరాజ్ వచ్చేశాడు…కొత్త అనుభూతి సిద్ధం!!

బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉన్న పుష్ప 2 ది…

1 hour ago

రాజా సాబ్ : ప్రభాస్ తో నయన్ చిందు వేయనుందా?

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ షూటింగ్ క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఏ స్టేజిలో…

2 hours ago