Political News

ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు స్వీట్ వార్నింగ్‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఎమ్మెల్యేలు అయిపోయాం క‌దా.. అని కొంద‌రు ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ స‌భ్య‌త్వాలు న‌మోదు కార్య‌క్ర‌మానికి ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నారు. నాకు అన్ని విష‌యాలు తెలుసు. నా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. మీరు నాట‌కాలు ఆడితే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. మ‌ళ్లీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే కుద‌ర‌దు. సొంత వ్య‌వ‌హారాలు మానుకోండి. ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వండి. ఇత‌ర విష‌యాలు ఏమైనా ఉంటే.. నేను చూసుకుంటా” అని తేల్చి చెప్పారు.

తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్న ఆయ‌న మంగ‌ళ‌గిరిలో పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ ఏడాది చేప‌ట్టిన‌ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై ఆయ‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో స‌మీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 73 ల‌క్ష‌ల మంది కొత్త‌గా స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స‌భ్య‌త్వ న‌మోదును మ‌రింత పెంచాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటున్నార‌ని తెలిసి.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరంతా ఏం చేస్తున్నారు? అని ఆయ‌న మీడియా ముందే పార్టీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు.

“పార్టీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాలి. ఏదో మీడియా మీటింగులు పెట్టి విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం క‌ష్టం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి. ప్ర‌జ‌ల‌ను మ‌రింత చేరువ అయ్యేలా చూడాలి. ప‌ద‌వులు ఊరికేనేరావు. చాలా మంది ప‌ద‌వులు రాలేద‌ని అలిగి ఇంట్లో ఉన్నారు. కానీ, క‌ష్ట‌ప‌డితేనే ప‌ద‌వులు ద‌క్కుతాయి. దీనికి నేనే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సార్లు తిరిగాను. ఇంటికి కూడా వెళ్ల‌కుండా.. రోడ్డుపైనే భోజ‌నం చేశాను(చిత్తూరులో). జైలుకు కూడా వెళ్లాను. ఈ మాత్రం కూడా క‌ష్ట‌ప‌డ‌కుండా.. ప‌ద‌వులు ర‌మ్మంటే ఎక్క‌డ నుంచి వ‌స్తాయి” అని నిల‌దీశారు.

పార్టీలో క‌ష్ట‌ప‌డే వారిని తాను గ‌మ‌నిస్తున్నాన‌ని.. నివేదిక‌లు తెప్పించుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీలో క‌ష్ట‌ప‌డే వారు ఏ మూల దాగి ఉన్నా.. వెతికి మ‌రీ ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు. అయితే.. ప‌ద‌వులు పొందిన వారు అల‌స‌త్వం వ‌హిస్తే.. ఆ ప‌ద‌వులు కూడా వెన‌క్కి తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. స‌భ్య‌త్వ న‌మోదుకు మ‌నం ఓ టార్గెట్ పెట్టుకున్నాం. కానీ, ఎచీవ్ చేసేందుకు కొంద‌రు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట‌లో టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు ఆశించిన దానికంటే ఎక్కువగా జ‌ర‌గ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

This post was last modified on December 15, 2024 8:46 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

40 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

47 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago