Political News

ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ నేత‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోని వేముల మండ‌లంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా గృహ నిర్బంధం చేసిన‌ట్టు సీఐ న‌రసింహులు తెలిపారు.

ఏం జ‌రిగింది?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. త‌మ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయ‌కుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘ‌ర్ష‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్క‌డ నుంచి త‌ర‌లించారు. ఆ వెంట‌నే పులివెందుల‌లో ని జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న‌ను నిర్బంధించారు. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాల‌యం ముందు ఆందోళ‌నకు దిగారు. త‌మ నేత‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేత‌ల ఆదేశాల‌కు అనుగుణంగా పోలీసులు క‌క్ష సాధిపున‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపించారు. ఏం జ‌రిగింద‌ని త‌మ నేత‌ను గృహ నిర్బంధం చేశార‌ని వారు ప్ర‌శ్నించారు. అయితే.. చ‌ట్ట ప్ర‌కార‌మే తాము వ్య‌వ‌హ‌రించామ‌ని.. క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని సీఐ న‌ర‌సింహులు తెలిపారు.

This post was last modified on December 13, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ వచ్చేదాకా ఊపు రాదా

సంక్రాంతి సినిమాల సందడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మహా అయితే ఇంకో వారం బండి లాగొచ్చు కానీ ఆ తర్వాత…

21 minutes ago

ఒక్కడు దర్శకుడి ఒంటరి పోరాటం

దర్శకుడు గుణశేఖర్ అంటే మూవీ లవర్స్ కు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. భారీతనానికి కేరాఫ్ అడ్రెస్…

1 hour ago

బన్నీ సినిమా గ్లింప్స్‌ పై ఊరిస్తున్న దర్శకుడు

‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్‌తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్‌లో…

2 hours ago

లైంగిక ఆరోపణలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను…

2 hours ago

ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ హైస్ట్ @ 400 కోట్లు!

అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2…

2 hours ago

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని…

3 hours ago