జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం, సరుకులు పంచారట. అయితే, అవి అత్యంత నాణ్యం రహితంగా పూర్తిగా పాడైపోయినవి పంచారు. ఆ సరుకులు తీసుకున్న జర్నిస్టులు మమ్మల్ని ఇంత అవమానిస్తారా? దీనికంటే మీరు ఇవ్వకుండా ఉంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి… జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. వారు తీసుకున్న బియ్యన్న పరిశీలించి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత చండాలంగా పంచారే అని అన్నారు.
అనంతరం ఆయన దీనిపై మాట్లాడుతూ… కలెక్టరు పెద్ద మనసుతో జర్నలిస్టులకు అండగా నిలవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం పప్పులు పంచారు బానే ఉంది. కానీ వాటి నాణ్యత సంగతి పక్కన పెడితే జంతువులు తినేవిధంగా కూడా లేవు ఆ బియ్యం. పూర్తిగా పాడైపోయాయి అంటూ స్వయంగా తనే మీడియాతో చెప్పారు. మరి కలెక్టరుదు పెద్ద మనసు అన్నారు సరే, ఎమ్మెల్యే వచ్చి బాధపడ్డారు బానే ఉంది… మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈ ఎమ్మెల్యే ఎవరిని నిందించినట్టు? కంటి తుడుపుకోసం చేసిన మాటలా? లేక జగన్ పై విమర్శలా? ఏమని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వమే పంచి, అధికార పార్టీ నాయకులే విమర్శలు చేస్తే… అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియని అయోమయ పరిస్థితి.
This post was last modified on April 28, 2020 8:56 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…