పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదానీ, మణిపూర్, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభలు సజావుగా సాగడం లేదు. ఇక, ఇప్పుడు రాజ్యసభలో నోట్ల కట్టల వివాదం తెరమీదికి వచ్చింది. ఓ సీటు వద్ద రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించడం వివాదానికి, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల కట్టలు లభించడంపై విస్మయం వ్యక్తం చేసిన చైర్మన్.. విచారణకు ఆదేశించారు.
ఏం జరిగింది?
శుక్రవారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే.. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. 222వ నెంబరు సీటు వద్ద 500, 100 రూపాయల నోట్ల కట్టలు లభించాయని పేర్కొన్నారు. ఈ సీటును కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించానని, నోట్ల కట్టల విషయం తన దృష్టికి రాగానే విచారణ కు ఆదేశించానని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ విషయం వెలుగు చూసిందన్నారు. అయితే.. జగదీప్ ధన్‌ఖడ్ చేసిన ప్రకటన సభలో నిరసనకు దారి తీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రూ.500, రూ.100 నోట్ల కట్టలు వెలుగు చూడడంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అధికార బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే.. విచారణకు అభ్యంతరం లేదన్న కాంగ్రెస్ సభ్యులు అసలు విచారణే జరగకుండా.. తమ సభ్యుడి పేరు(సింఘ్వీ) ఎలా చెబుతారని నిలదీశారు. రాజ్యసభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంపై నిప్పులు చెరిగారు. అయితే.. విచారణకు తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు.
శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను వాయిదా వేశారు. అనంతరం.. సాధారణ విధుల్లో భాగంగా భద్రతా సిబ్బంది ఛాంబర్‌ను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వారికి 222వ నెంబరు సీటు వద్ద… రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించాయి. దీంతో చైర్మన్ వెంటనే దీనిపై విచారణ కు ఆదేశించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులకు వివరించారు. అయితే.. “ఆ సీటును కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాం” అని చైర్మన్ వెల్లడించడం వివాదానికి దారితీసింది.
This post was last modified on December 6, 2024 2:02 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…