కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ చేసిన షిప్‌పై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన లింకులు వెలికితీసేందుకు రెవెన్యూ, కస్టమ్స్, పోలీస్, సివిల్ సప్లై టీమ్స్ కలిసి ఆరా తీస్తున్నాయి. ఇందులో గ్రామీణ స్థాయిలోనే అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్న అధికారుల పాత్రపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తూ, ప్రతి కార్యకలాపాన్ని కఠినంగా పర్యవేక్షించనున్నారు.
షిప్ సీజ్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల మధ్య, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారి తీసినప్పటికీ, కార్యాచరణ మాత్రం కట్టుదిట్టంగా ఉండబోతుంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి సర్కారు నిష్క్రమణ స్పష్టమైంది. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు అన్ని కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని చర్యల ద్వారా రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
This post was last modified on December 4, 2024 12:17 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…