ప్రతిపక్ష వైసీపీ నాయకులు తరచుగా సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టనున్నారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని.. ఆయన రాజధానిని కడతానని చెబుతు న్నారంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం.. ప్రస్తుతం ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు చంద్రబాబు అదే రాజధానిలోని వెలగపూడిలో శాస్వత నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజధానికి నడిబొడ్డు ప్రాంతమైన వెలగపూడిలో 25 వేల చదరపు గజాల(ఐదు ఎకరాలు) స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులది కావడం గమనార్హం. ఇది కూడా రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నదేనని, రిటర్నబుల్ ఫ్లాట్ అని తెలిసింది. ఆ రైతులకు ఇప్పటికే సంబంధిత సొమ్ములు జమ చేశారని సమాచారం.
ఇక, స్థలం విషయానికి వస్తే.. వెలగపూడిలోని ప్రధాన సీడ్ యాక్సిస్ రోడ్డుకు పక్కనే ఈ స్థల ఉంటుంది. పైగా.. నాలుగువైపులా రోడ్డు ఉండేలా చూసుకున్నారు. అదేవిదంగా గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాసాల మధ్య, న్యాయమూర్తుల బంగళాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లకు ఈ స్థలానికి కేవలం రెండు కిలో మీటర్ల పరిదిలోనే ఉన్నాయి. దాదాపు ఐదు ఎకరాల్లోని ఈ స్థలంలో కొంత స్థలాన్ని ఇంటికి, మరికొంత స్థలాన్ని తోటలకు, భద్రతా సిబ్బంది గదులకు కేటాయిస్తారు. అదేవిధంగా పార్కింగ్‌కు కూడా కొంత స్థలాన్నికేటాయించనున్నారు.
ఈ నిర్మాణం ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా.. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన, చేస్తున్న విమర్శలకు ఆయన తనదైన శైలిలో జవాబు చెప్పనున్నారనేది స్పష్టం. ఇదిలావుంటే.. సొంత నియోజకవర్గం కుప్పంలోనూ చంద్రబాబుకు నివాసం లేదని అప్పట్లో వైసీపీ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 35 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సొంత ఇల్లు కట్టుకోలేదని విమర్శించారు. దీంతో గత ఏడాదిన్నర కిందటే కుప్పంలోనూ చంద్రబాబు ఇంటికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి.. అంటే మరో నాలుగు మాసాల్లో ఆ ఇల్లు కూడా పూర్తి కావస్తోంది. ఏదేమైనా.. వైసీపీ విమర్శల పుణ్యమా అని.. చంద్రబాబు ఒక ఇల్లు కాదు.. నాలుగిళ్ల వాడవుతున్నారన్నది ఆసక్తికరం.
This post was last modified on December 4, 2024 1:00 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…