మహారాష్ట్రలో గత 10 రోజులకు పైగానే నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు బీజేపీ పెద్దలు ముగింపు పలికారు. గత నెల 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం దక్కించుకుంది. మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మహాయుతి కూటమి 235 స్థానాలు దక్కించుకుంది. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన నవంబరు 26వ తేదీనాటికి.. మహాయుతిలో ముఖ్యమంత్రిపీఠంపై రగడ ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి ఆపద్ధర్మ ప్రభుత్వమే కొనసాగుతోంది. మొత్తం 235 స్థానాలలో తమకు 132 స్థానాలు దక్కడంతో తమకే ముఖ్యమంత్రి స్తానం దక్కాలని కమలనాథులు పట్టుబట్టారు.
అయితే.. తమ సహకారం లేకుండా మహాయుతి ఏర్పడలేదని శివసేన అధినేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా.. ముఖ్యమంత్రిపీఠాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ముఖ్యమంత్రిపీఠంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ విషయంపై పలు మార్లు ఢిల్లీలో ఇరు పక్షాల మధ్య చర్యలు జరిగాయి. అయినప్పటికీ.. ఎక్కడా పరిష్కారం లభించలేదు. చివరకు ఏక్‌నాథ్ షిండే అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఇక, మహాయుతి విచ్ఛిన్నం అవుతుందని జాతీయ మీడియాలో కథనాలువచ్చాయి. దీనిపై హుటాహుటిన స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి,బీజేపీ అగ్రనేత అమిత్ షా.. క్షేత్రస్థాయిలో నాయకులను అలెర్టు చేశారు.
ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మలా సీతారామన్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసి మహారాష్ట్రకు పంపిం చారు. ఈ క్రమంలో రెండున్నరేళ్లు మీరు.. రెండున్నరేళ్లు మేము! అనే ప్రతిపాదన కూడా.. శివసేన నుంచి తెరమీదికి వచ్చింది. దీనికి కూడా బీజేపీ అంగీకరించలేదు. ఇక, హోం శాఖను మాత్రం శివసేన వర్గానికి కేటాయించేలా నిర్ణయించారు. దీంతో వివాదం దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఉన్నట్టుగానే ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండేలా నిర్ణయించారు. దీనిప్రకారం.. బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎంగా, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను ఉప ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ను మరో ఉప ముఖ్యమంత్రిగా నిర్ణయించారు.
ఆయా ప్రతిపాదనలకు ఇరు పక్షాలు అంగీకారం తెలిపాయి. హోం శాఖను శాంతి భద్రతలతో సహా శివసేనకు అప్పగిస్తారు. అదేవిధంగా మునిసిపల్ శాఖను కూడా ఈ పార్టీకే ఇస్తారు. ఇక, అటవీ, రహదారి శాఖలను ఎన్సీపీకి కేటాయిస్తారు. మొత్తంగా.. మహాయుతిలో కీలక నిర్ణయాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. మరో వైపు ఈ నెల 5న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందనున్నాయి.
This post was last modified on December 4, 2024 9:16 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్‌కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…