దేశాన్ని రెండు దశాబ్దాలుగా కుదిపేస్తున్న గుజరాత్‌లోని గోద్రా రైలు దుర్ఘటన వ్యవహారం.. ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద సబర్మతి రిపోర్టు’ సినిమాను ప్రదర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించే ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరై వీక్షించనున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్రమంత్రులు, పార్లమెంటు ఉభయ సభ్యులను కూడా ఆహ్వానించారు.
గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నాటి ఉదంతానికి సంబంధించి దాగి ఉన్న అనేక అంశాలను చూపించారు. గత నెల 15న విడుదలైన ద సబర్మతి రిపోర్టు సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు. మొత్తం 50 కోట్ల రూపా యల వ్యయంతో ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వికాస్ మోహన్, అన్షుల్ మోహన్‌లు నిర్మించారు. కాగా, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సినిమాను ప్రశంసించిన విషయం తెలిసిందే.
అసలేంటిది?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీ ఉన్న సమయంలో 2002లో గోద్రా రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది హిందువులు ప్రయాణిస్తున్న రైలుకు.. కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత.. ఓ మతానికి చెందిన వారిని పోలీసులు కాల్చి చంపారు. దీనిపై అప్పట్లోనే రాజకీయంగా తీవ్ర దుమారం, విమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రదాని నరేంద్ర మోడీకి ఇప్పటికీ గోద్రా తాలూకు విమర్శలు తగులుతూనే ఉన్నాయి.
ఇదిలావుంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ న్యూస్.. ‘మోడీ ఫైల్స్’ పేరుతో డాక్యుమెంట్ సిరీస్ తీసింది. ఈ సిరీస్‌లో మోడీ చుట్టూ ఉన్న అనేక విమర్శలను ఎత్తి చూపించారు. ఈ పరిణామాల క్రమంలోనే బీబీసీ కార్యాలయాలపై సీబీఐ, ఐటీ దాడులు జరగడం, ఆ సంస్థ భారత్‌లోని తమ కార్యాలయాలను మూసి వేస్తున్నామని ప్రకటించడం తెలిసిందే.
ఈ ఘటన కూడా అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్శకుడు సర్నా తీసిన సబర్మతి సినిమాలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారన్నది బీజేపీ మాట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్రధాని ప్రశంసించడం.. దానిని ఏకంగా పార్లమెంటులో ప్రదర్శిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2024 2:05 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…