మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పోస్టు కోసం జరుగుతున్న లాబీయింగ్ ఒకపట్టాన తేలడంలేదు. దీనిని తామే తీసుకుంటామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం బీజేపీ+శివసేన+ఎన్సీపీలు కలిసి కట్టుగాఅధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.
అయితే.. ఈయనను తప్పించి బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి షిండే ససేమిరా అంటున్నారు. ఒకవేళ సీఎం పోస్టు ఇవ్వకపోయినా.. తమకు హోం శాఖను పూర్తిగా(శాంతి భద్రతలతో సహా) అప్పగించాలని పట్టుబడుతున్నారు. దీనికి బీజేపీ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. అంటే.. ఏకమొత్తంగా ముఖ్యమంత్రి సీటు సహా హోం శాఖ పగ్గాలు కూడా.. బీజేపీనే కొరుకుంటోంది.
ఇదే ఇప్పుడు మహాయుతి కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న చర్చకు కారణమైంది. శివసేన నాయకులు బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని మహా మీడియా వెల్లడిస్తోంది. అయితే.. దీనివల్ల ఎవరికీ అధికారం దక్కదు. ఈ క్రమంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా తిరిగి ఆరుమాసాల్లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. భారీ విజయం దక్కించుకున్న దరిమిలా .. దాన్ని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడదు.
దీంతో బుజ్జగింపు పర్వాలకు తెరదీసింది. అయినప్పటికీ.. శివసేన మాత్రం లొంగడం లేదు. తాజాగా బీజేపీ పెద్దలతో సమావేశాలకు తాను హాజరు కావడం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తేల్చి చెప్పా రు. ఈనేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మురళీధర్ పేరు ను ముఖ్యమంత్రి సీటు కోసం పరిశీలిస్తున్నట్టు లీకులు ఇచ్చింది.
తద్వారా.. శివసేనలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఫడణవీస్‌ను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదిప్లాన్. అయినప్పటికీ.. హోం శాఖను సంపూర్ణంగా ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది. ఇది సాధ్యం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలతో మహాయుతి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on November 30, 2024 2:00 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…