ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా అయిపోవడంతో ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ పై విపరీతమైన హైప్ ఉంది. పట్నా, చెన్నైలో రాజుకున్న ‘పుష్ప:ది రూల్’ వైల్డ్ ఫైర్ గురించి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో చర్చ జరుగుతోంది. అయితే, ఆశ్చర్యకరంగా ఏపీ రాజకీయాలకూ ‘పుష్ప’ కార్చిచ్చు అంటుకుంది. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పుష్ప చిత్రాన్ని అడ్డుకోవాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావని, బాక్సాఫీస్ దగ్గర పుష్ప రికార్డులు బద్దలు కొడుతుందని అంబటి రాంబాబు చెప్పారు. పుష్ప చిత్రంపై వ్యాఖ్యలతో ఆగని అంబటి…దేవర చిత్రంపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. దేవర చిత్రంపై కూడా కొందరు దుష్ప్రచారం చేసినా సినిమా హిట్ అయిందని అన్నారు. అదే తరహాలో పుష్ప-2 చిత్రంపై కూడా విష ప్రచారం చేయాలని చూస్తున్నారని, ఎవరేం చేసినా పుష్ప-2 పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
ఎవరేం చేసినా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను బాయ్ కాట్ చేయలేరని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అని, ఆయన సినిమా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎదురు చూస్తున్నారని, అందులో తాను కూడా ఒకడినని అంబటి చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, అల్లు అర్జున్ ల మధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం పుష్ప-2 ను టార్గెట్ చేస్తుందన్న కోణంలో అంబటి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, గత ప్రభుత్వంలో పుష్ప-1 రిలీజ్ అయిందని, అప్పుడు సినిమా టికెట్ల ధరలను జగన్ సర్కార్ తగ్గించడంతో ఏపీలో కలెక్షన్లు తగ్గాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు అంబటికి సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు పుష్ప-2 సినిమా టికెట్ రేట్ల విషయంలో, స్పెషల్ షోల విషయంలో ఇంకా ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇంతలోపే గుమ్మడి కాయల దొంగలాగా అంబటి భుజాలు తడుముకోవడం దేనికని సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on November 25, 2024 6:02 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…