ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం సంచలన విజయం నమోదు చేసింది. టీడీపీ గెలిస్తే ఫలానా మొక్కు చెల్లిస్తామని మొక్కుకున్న టీడీపీ అభిమానులు తమ మొక్కులు చెల్లించేసుకున్నారు. అయితే, కర్నూలులోని మద్దూర్ నగర్ లో టీడీపీ కార్యకర్త అయిన ఓ చికెన్ షాప్ యజమాని తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఏపీలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని, అందుకే తన షాప్ లో కేజీ చికెన్ 100 కే అమ్ముతున్నానని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
టీడీపీ విజయంతోపాటు తమ ప్రియతమ నేత, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు మంత్రి పదవి వచ్చినందుకు కిలో చికెన్ 100 రూపాయలే అమ్ముతున్నాని షమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు. అయితే, షమీర్ షాపునకు పోటీగా ఉన్న మరో సుభాన్ చికెన్ సెంటర్ యజమాని కూడా పోటీగా 100 రూపాయలకే కిలో చికెన్ అమ్మడం మొదలుబెట్టారు. ఇలా, ఈ ఇద్దరు వ్యాపారులు పోటీలుపడి చికెన్ రేటు తగ్గించడంతో చికెన్ ప్రియులు ఈ షాపుల దగ్గర బారులు తీరారు. దీంతో మద్దూర్ నగర్‌లో ఉన్న షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ చికెన్ సెంటర్ల దగ్గర జనం కోకొల్లలుగా చేరారు. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి మార్కెట్ లో కిలో చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. కార్తీక మాసం నేపథ్యంలో చాలా జిల్లాల్లో 125-150 రూపాయలకే కిలో చికెన్ అమ్ముతున్నాయి. షమీర్ తన పార్టీపై అభిమానంతో చికెన్ రేటు తగ్గిస్తే, కార్తీకమాసం కావడంతో చికెన్ రేటు తగ్గించామని సుభాన్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కేజీ చికెన్ బంపర్ ఆఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 25, 2024 2:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…