కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి రాజకీయ పాఠాలు ఎక్కడా బోధపడినట్టు కనిపించడం లేదు. తాను పట్టిన పట్టుకోసమే ఆయన పట్టుదలతో ఉండడంతో ప్రజలు రాహుల్ వైపు మొగ్గు చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా రెండు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు సహా ఇతర 13 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఓట్లనే దక్కించుకుంది. ఎక్కడా కూడా తలెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీగా ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీలు అధికారంలోకి వచ్చేస్తామని ఆశలు పెట్టుకున్నాయి. అధికారంలోకి రాకపోగా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోని నియోజకవర్గాలు ఎదురయ్యాయంటే ఆశ్చర్యం వేస్తుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 130 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని మోడీ నలిపేస్తున్నారని, చిదిమేస్తున్నారని చెప్పారు.
తాము వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నారు. అంతేకాదు.. మరాఠాలకు ప్రత్యేకగుర్తింపు ఇస్తామని, రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేస్తామని కూడా రాహుల్ చెప్పుకొచ్చారు. అయినా.. ప్రజలు ఆయనను పట్టించుకోలేదు. మొత్తంగా కూటమికి 54 సీట్లు వస్తే.. వీటిలో కాంగ్రెస్‌కు దక్కింది 21 సీట్లు. అంటే.. 288 సీట్లలో కనీసం 10 శాతం సీట్లు కూడా దక్కించుకోలేక పోయింది. దీనికి బాధ్యులు ఎవరు ? అంటే.. ఆది నుంచి అంతిమం వరకు ప్రచారాన్ని భుజానికెత్తుకున్న రాహుల్ వైపే అందరి వేళ్లూ కనిపిస్తున్నాయి.
మోడీ, అమిత్‌షా వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో రాహుల్ విఫలమవుతున్నాయి. కొన్నాళ్ల కిందట(ఈ ఏడాదే) జరిగిన జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ రాహుల్ ఫెయిలయ్యారు. కేవలం విమర్శలకు మాత్రమే ఆయన పరిమితం కావడం.. క్షేత్రస్థాయి జనం నాడిని ఆయన పట్టుకోలేక పోవడం వంటివి ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి.
పైగా బీజేపీ వ్యూహాలను అడ్డుకోవడంలోనూ ఆయన వెనుబడిపోయారు. మహారాష్ట్ర ఒక్కటే కాదు.. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. అధికారంలోకి వచ్చామన్న ఆనందం ఒక్కటే తప్ప.. మెజారిటీ స్థానాల్లో జేఎంఎంమాత్రమే విజయం దక్కించుకుంది. సో.. ఎలా చూసుకున్నా.. రాహుల్ రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలేమో! అనే చర్చ అయితే సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 24, 2024 7:58 am
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…