Political News

నొప్పింప‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు..!

కొన్ని కొన్ని విష‌యాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఏపీలో జ‌రిగింది. తాజాగా అమెరికాలో కేసులు న‌మోద‌య్యాయ‌ని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ వ్య‌వ‌హారం.. దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వేడి ఇప్పుడు ఏపీని కూడా తాకింది. జ‌గ‌న్ సైతం ముడుపులు తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

వాస్త‌వ నివేదిక ఎలా ఉంద‌న్న విష‌యానికి వ‌స్తే.. అదాని వంటి సంస్థ‌లు ఏర్పాటు చేసే ప్రాజెక్టుల విషయంలో ప‌క్కాగానే ఉంటాయి. అయితే.. ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయిన పోటీ వాతావ‌ర‌ణం .. రాజ‌కీయ ఒత్తిడులు.. వంటివి కార్పొరేట్ సంస్థ‌ల‌ను కూడా ప‌క్కదారి ప‌ట్టిస్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకుంటున్నాయి. స‌రే.. ఎవ‌రు త‌ప్పు చేసినా స‌మ‌ర్థించ‌రాద‌న్న‌ది వాస్త‌వం కాబ‌ట్టి.. గౌతం అదానీ నుంచి జ‌గ‌న్ సొమ్ములు తీసుకుని ఉంటే విచార‌ణ చేస్తారు.

ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు నేరుగా స్పందించేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు. స‌భ‌లో ప‌లువురు స‌భ్యులు చాలా దూకుడుగానే స్పందించారు. జ‌గ‌న్ అవినీతి అంత‌ర్జాతీయ స్థాయికి చేరింద‌ని సభ్యులు బాగానే నోరు చేసుకున్నారు. కానీ, చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఆయ‌న ఆచితూచి స్పందించారు. ఒక‌వైపు సున్నితంగా విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు చాలా వ్యూహం తోనే ముందుకు సాగారు.

దీనికి కార‌ణం.. అదానీ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని మోడీ కీల‌కంగా మారారు. అదానీ గుజ‌రాత్‌కు చెందిన వ్యాపారి కావ‌డం, ఆయ‌న కు బీజేపీకి మ‌ధ్య అవినాభావ సంబంధం.. ఉండ‌డం, ముఖ్యంగా మోడీ-అమిత్‌షా ద్వ‌యానికి ఆయ‌న మిత్రుడు కావ‌డంతో చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు. నొప్పింప‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు కూట‌మి ప్ర‌భుత్వ వ్యూహానికి అద్దం ప‌ట్టింది. మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి

This post was last modified on November 23, 2024 7:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

33 minutes ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

45 minutes ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

2 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

2 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

2 hours ago

కష్టపడి దర్శకత్వం చేస్తే ఫలితం దక్కిందా?

హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…

2 hours ago