జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా+కాంగ్రెస్ విజయం దక్కించుకున్నాయి. వాస్తవానికి జార్ఖండ్ ప్రజల నాడిని గమనిస్తే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఏ పార్టీకి కూడా.. వరుసగా ప్రజలు విజయాన్ని కట్టబెట్టడం లేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం గత చరిత్రకు బ్రేకులు వేస్తూ.. ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఈ రాష్ట్రాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. “అవినీతి పరులు, లంచగొండులు, జైలుకు వెళ్లివచ్చినవారు, కుటుంబ ద్రోహులు” అంటూ.. సీఎం హేమంత్ సొరేన్ కుటుంబాన్ని, ఆయనను కూడా లక్ష్యంగా చేసుకుని కమల నాథులు విమర్శలు గుప్పించారు.
అయితే.. తాజాగా వెలువడిన ఫలితాల్లో జేఎంఎం+కాంగ్రెస్ కూటమి 56 స్థానాల్లో దూకుడుగా ఉంది. ఇక, అనేక వ్యూహాలు పన్ని.. చివరకు జేఎంఎంలోనూ చిచ్చు పెట్టి.. మాజీ సీఎం, హేమంత్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న చంపయి సొరేన్‌ను కూడా తమవైపు మళ్లించుకుని, హేమంత్ సోదరు డి భార్యను తమవైపు తిప్పుకొన్నా.. ప్రజలు కమల నాథులను హర్షించలేదు. వారివైపు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలోనే హేమంత్ సొరేన్‌కు ప్రజలు పట్టం కట్టారు.
దాదాపు రెండు మాసాల పాటు హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. గనుల కుంభకోణాలు కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. అది కూడా ఎన్నికలకు ముందే జరిగింది. దీని తాలూకు సింపతీ తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఇదే గత పాతికేళ్ల చరిత్రను తిరగరాసి.. వరుసగా హేమంత్ సర్కారుకు మరోసారి విజయం దక్కించిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 23, 2024 2:18 pm
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు…
మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన…
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…