బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ భారీ మొత్తాలను తప్పుడు పద్దతుల్లో సమాచారాన్ని ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.
ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు 8 మంది మీద (గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్. జైన్.. అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా తదితరులు) కేసులు నమోదయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోజు వారీ మీడియా బ్రీఫ్ లో భాగంగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ స్పందిస్తూ.. అదానీపై కేసు నమోదైన అంశం తమ ద్రష్టికి వచ్చిందని.. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. న్యాయశాఖనే సరైన సమాచారాన్ని ఇవ్వగలదన్నారు.
ఎప్పటిలానే భారత్ – అమెరికా సంబంధాలు బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక అంశాల మీద పరస్పరం సహకారం అందించుకున్నట్లుగా పేర్కొంటూ.. మిగిలిన సమస్యల మాదిరే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని.. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలిచినట్లుగా పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా ఏపీ.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే వైట్ హౌస్ కూడా రియాక్టు అయ్యింది.
This post was last modified on November 22, 2024 11:39 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…