అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో ని న్యూయార్క్ లో కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీతోపాటు ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది.
అదానీ గ్రూపు 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగలిగేలాగా సౌరశక్తి సరఫరాకు సంబంధించిన ఒప్పందాల కోసం 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇచ్చేందుకు అదానీ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అమెరికాతోపాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సేకరించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ పెట్టుబడిదారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించిందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి ఏపీతో లింకులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందంలో 2019 నుంచి 24 వరకు ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 2021లో ఏపీకి చెందిన కొందరు అధికారులకు అదానీ లంచాలు ఇచ్చారని, ఈ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయిని ఆరోపణలు వస్తున్నాయి. ఆ విదేశీ అధికారులతో, రాయబారులతో ఆంధ్రప్రదేశ్ లో అదానీ 2021 సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీలలో భేటీ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో ఒప్పందాల కోసం కూడా 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చేందుకు అదానీ సిద్ధమయ్యారని ఆరోపణలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో డిస్కంలో భారీ నష్టాలు వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలను వేగంగా అమలు చేసేందుకు ముడుపులు ఇచ్చారని ఆరోపణలున్నాయి. అమెరికాలో నమోదైన కేసు ప్రకారం ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు చెందిన గౌతం అదానీతోపాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఐదుగురిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కేసు నమోదు అయింది.
This post was last modified on November 21, 2024 9:51 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…