పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో పార్టీలను గెలిపించి….మరెందరినో గెలుపు గుర్రాలెక్కించారు. తన టీం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, 2015లో బిహార్‌లో మహా ఘట్ బంధన్, 2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్…ఇవన్నీ పీకే విజయగాథలు.
2017లో యూపీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో పీకే స్ట్రాటజీస్ వర్కవుట్ అయ్యాయి. అందుకే, పీకే సేవల కోసం పార్టీలన్నీ క్యూ కడుతున్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీకే మోస్ట్ వాంటెడ్ అయ్యారు.
ప్రస్తుతం 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున రాజకీయ వ్యూహకర్తగా పీకే పనిచేయనున్నారు. ఆల్రెబీ బిహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఆ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ బిజీగా మారనున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున పీకే ఎన్నికల వ్యూహకర్తగావ్యవహరిస్తున్నారు.
పంజాబ్ లో కాంగ్రెస్ తరుపున పీకే వ్యూహాలు రచించనున్నారు. మరో మూడేళ్లున్నప్పటికీ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అధినేత కుమారస్వామి కూడా పీకేని లైన్ లో పెట్టాలని చూస్తున్నారు. ఇలా తన ఐప్యాక్ టీంతో పార్టీలను, నేతలను సిక్స్ ప్యాక్ గా మార్చిన పీకే ఇపుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ అయ్యారు. మరి,గతంలో మాదిరి భవిష్యత్తులో పీకే ఎంతమందిని గెలుపుగుర్రాలు ఎక్కిస్తారన్నది వేచి చూడాలి.
This post was last modified on October 11, 2020 4:15 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…