ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా చెప్పారు. అయినా సరే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ క్లారిటీనిచ్చారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అది తమ అందరి కమిట్మెంట్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, ప్లాంట్ నడిపే విషయంలో కొన్ని లోపాలున్నాయని, మంత్రి భరత్ గారు చెప్పినట్లు పెట్టుబడి, మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ వంటి అంశాలలో సవాళ్లున్నాయని పవన్ చెప్పారు. నెలరోజుల క్రితం కూడా కార్మికులతో మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాను అని వారితో తాను చెప్పానని పవన్ అన్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి కుమార స్వామి రెండు నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిశీలించిన సందర్భంగా స్వయంగా ప్రకటించారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. అంతకన్నా ఇంక ఏం ప్రకటన ఇవ్వాలో తనకు అర్థం కావడం లేదనిఅన్నారు. టీడీపీ, జనసేనల పోరాటంతో పాటు పలు రిట్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాతే గత ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వెనక్కు తగ్గిందని గుర్తు చేశారు.
ఇక, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమార స్వామిలను కలిశారని గుర్తు చేశారు. ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమార స్వామి వచ్చారని చెప్పారు. ఆ సందర్భంగా కార్మికులతో కూడా కుమార స్వామి భేటీ అయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమార స్వామి చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
This post was last modified on November 21, 2024 11:27 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…