ఉత్తరాది రాష్ట్రాల్లో కీలకమైన జార్ఖండ్‌లో 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి రెండువిడతల్లో జరిగిన ఎన్నికలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలతో రెండో విడత పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గనులకు ఖిల్లాగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శత విధాల ప్రయత్నాలు చేసింది. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మరోసారి పరాభవం తప్పేలా లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఎవరు గెలిచినా.. అత్యంత స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నాయి.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుత అధికార కూటమి కాంగ్రెస్+జేఎంఎంలు మరోసారి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఎస్ ఏఎస్ సర్వే.. లెక్కల ప్రకారం.. జార్ఖండ్‌లో బీజేపీకి 44% నుంచి 45% సీట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. మొత్తం సీట్లలో 36-38 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. నిజానికి ఇక్కడ విజయం కోసం .. బీజేపీ చాలానే ప్రయోగాలు చేసింది. జేఎంఎంలో కీలక నేతగా ఉన్న మాజీ సీఎం చంపయి సొరేన్‌ను తన గూటిలో చేర్చుకుంది.
ఇక, సీఎంగా ఉన్న జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్‌ను జైలుకు పంపించింది ప్రస్తుతం ఆయన బెయిల్‌పై వచ్చాయి. అయితే.. ఇంత జరిగినా.. విజయం మాత్రం బీజేపీ పరం కావడం లేదన్నది ఎస్ ఏఎస్ సర్వే చెబుతున్న మాట. ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం ఇండియా కూటమి స్వల్ప మెజారిటీతో విజయం దక్కించుకునే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. దీని ప్రకారం.. ఇండియా కూటమికి 43-45 సీట్లు దక్కే అవకాశం ఉంది. అంటే.. మెజారిటీ మార్కు 45కు చేరువ అయ్యే ఛాన్స్ ఉందని తేలింది. ఇక, స్వతంత్రులు, ఇతర చిన్నా చితకా పార్టీలకు 2-5 సీట్లు దక్కనున్నాయి.
అయితే, పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పడం విశేషం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 42 నుండి 48 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 38-42 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక, ఇతరులు 6 నుండి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
This post was last modified on November 21, 2024 12:14 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…