Political News

చంద్రబాబు అరెస్టుపై అట్టుడికిన అసెంబ్లీ

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే చంద్రబాబును అరెస్టు చేశారని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై టీడీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహా కుట్ర జరిగిందని కోటంరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాటు జరిగిందని తాను చెప్పలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. సీఐడీ, సీఎంవో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్ళు మాయం కావడం, చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ హస్తముందని ఆ అధికారి అభిప్రాయపడ్డ విషయాన్ని సభలో ప్రస్తావించారు.

అంతేకాకుండా, ఆ ఫైళ్లు మాయం కావడంతోపాటు, తన వాంగ్మూలంపైన విచారణ జరిపించాలని డీజీపీకి పీవీ రమేష్ లేఖ రాశారని గుర్తు చేశారు. అ లేఖపై విచారణపై గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఆ లేఖపై, విచారణపై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. 53 రోజులపాటు అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారని, జీరో అవర్ పక్కన పెట్టి ఆ వ్యవహారం గురించి మాట్లాడాలని కోరారు. ఆ అంశంపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది చాలా సీరియస్ అంశమని, జీరో అవర్ లో దీనిపై సమాధానం కుదరలేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చిద్దామని స్పీకర్ రఘురామ సూచించారు.

This post was last modified on November 19, 2024 3:26 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago