ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పేరును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించడం.. చిచ్చు రేపింది. భూముల పై జరిగిన చర్చలో మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ.. భూముల అక్రమాలపై ఉక్కుపాదంమోపుతామని చెప్పారు. ప్రజల భూములను అడ్డంగా దోచుకున్నవారిని ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని తెలిపారు.
ఈ సమయంలో రెండు మూడు నెలల కిందట తిరుపతి జిల్లా మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో వేలాది ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపైనా విచారణ సాగుతున్నట్టు మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో ఆయన పెద్దిరెడ్డి పేరును ఉటంకించారు. “అందరి సంగతీ త్వరలోనే బయటపడుతుంది. మదన పల్లె ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని మా వాళ్లు చెబుతున్నారు. ప్రజల భూములు దోచుకుని ఆయన భార్య పేరిట పెట్టుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రభుత్వం మారిన వెంటనే ఫైళ్లను దగ్ధం చేయాలని పెద్దిరెడ్డి అనుకున్నారని మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రి మాటలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభలో లేని.. పెద్దిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో బొత్స కూడా నియంత్రణ తప్పారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి! అని వ్యాఖ్యానించారు.
“అధ్యక్షా.. సభలో లేని వారి గురించి మాట్లాడడం సంస్కారమా? చెప్పండి. లేని పోని అపవాదులు మాపై వేస్తున్నారు. మీరు విచారణ చేస్తున్నారు కాబట్టి.. చేసుకోండి. కానీ, సభలోలేనివారి గురించి ఎందుకు చెబుతున్నారు. మీకు చేతనైంది చేసుకోండి. కానీ, పెద్దిరెడ్డి పేరు ఎత్తొద్దు. రికార్డుల నుంచి కూడా దీనిని తొలగించాలి” అని బొత్స డిమాండ్ చేశారు. ఈ సమయంలోఅధికార పక్ష సభ్యులు బొత్సకు అడ్డుపడ్డారు. తప్పు చేశారు కాబట్టే మంత్రి మాట్లాడారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో మండలిలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on November 19, 2024 2:02 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…