ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ తో ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్న రాహుల్ ఒక విషయాన్ని మాత్రం జనాల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అదే రిజర్వేషన్ ఎత్తివేత అస్త్రం. దేశంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తివేస్తామని, అలాగే కులగణనను చేపడతామని ఆయన ఎప్పటికప్పుడు మీటింగ్ లలో హైలెట్ చేస్తున్నారు.
మహారాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో రిజర్వేషన్ కు సంబంధించిన విషయాలలో మెజార్టీ జనాలు ఓకే ఆలోచనతో ఉన్నట్లు కాంగ్రెస్ పసిగట్టినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ అదే ఆయుధంగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే కులగణన తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, దానిని నెరవేర్చడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయిన ఈ ఎన్నికల్లో పేదలు, సాధారణ ప్రజలు, కొంత మంది కోటీశ్వరుల మధ్య పోటీ ఉందని రాహుల్ అన్నారు.
మహారాష్ట్ర యువతను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలించడమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచిందని ఆరోపించారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ వంటి ప్రాజెక్టులను రాష్ట్రం నుంచి తరలించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ యంత్రాంగాన్ని ఉపయోగించి ధారవి పునరాభివృద్ధి పథకాన్ని తప్పుదోవ పట్టించారంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మహా వికాస్ అఘాడీ లక్ష్యమని, తమ పొత్తు గట్టి అస్త్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు మహారాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశించే కీలక దశగా అభివర్ణించారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరిస్తోందని, కొంత మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే మొగ్గు చూపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గౌతమ్ అదానీ మధ్య ఉన్న సంబంధం కారణంగానే వారు ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కోవడం లేదని అన్నారు. కులగణన పూర్తయితే దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సంక్షేమానికి కొత్త దారి తెరవబడుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల పరిమితి తొలగించి సామాజిక సమానత్వానికి బీజం వేస్తామన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ప్రధాన అస్త్రాలుగా మార్చుకునే దిశగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 19, 2024 9:59 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…