వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి వైసీపీ అండగా ఉందని ఆమె ఆరోపించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె పాదయాత్ర కూడా చేసి ప్రచారం నిర్వహించారు. దీంతో కడపలో కీలకమైన నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఇక, ఇప్పుడు మరోసారి సునీత అరంగేట్రం చేశారు. ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరులుగా ఉంటూ.. ఆ పార్టీ నేతలకు అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్న వారిపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో వైసీపీ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు కూడా తరలించారు. వీరిలో కీలకమైన వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి కూడా ఉన్నాడు.
ఇప్పుడు ఈయనపై సునీత కూడా ఫిర్యాదు చేసేందుకు కడపకు వచ్చారు. పులివెందుల పోలీసు స్టేషన్‌లో సునీత వర్రాపై కేసు పెట్టారు. తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని.. చెప్పడానికి కూడా అలివికాని భాషలో రెచ్చిపోయారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్రా సహా పులివెందులకు చెందిన మరో వైసీపీ సానుభూతిపరుడు ఉదయ్‌పైనా సునీత ఫిర్యాదు చేశారు. వీరిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించారు.
కాగా, ఇప్పటికే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు నమోదైనట్టు ఏపీ పోలీసులు తెలిపారు. వర్రా పూర్తిగా సజ్జల భార్గవ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేశారని, ఆయన చెప్పినట్టే వ్యాఖ్యలు చేశారని కూడా రెండు రోజుల కిందట కడప పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సునీత ఫిర్యాదును కూడా దానికి జత చేసి, మరో కేసునమోదు చేయనున్నారు. దీంతో వర్రాకు మరింత ఉచ్చు బిగుసుకున్నట్టయింది. దీంతో వైసీపీ నాయకులు ముఖ్యంగా పులివెందుల నేతలు ఆచూకీ లేకుండా పోయారు.
This post was last modified on November 13, 2024 10:31 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…