ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రాజధాని గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు రాజధాని గురించి చెప్పిన మాటలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రాజధాని ఒకటే ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చంద్రబాబు అన్నారని లోకేష్ చెప్పారు.
అదే సమయంలో ఉమ్మడి జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ చేశారని, ఒక్కో జిల్లాకు ఒక్కో సెక్టర్ కేటాయించి ఫోకస్ చేశారని లోకేష్ అన్నారు. జిల్లాలు యూనిట్ గా అన్ని ఉమ్మడి జిల్లాలకు పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు.
రాయలసీమలో అనంతపురానికి కియా పరిశ్రమ, ఉత్తరాంధ్రకు ఐటీని, నెల్లూరుకు టెలిఫోన్ పరిశ్రమ, కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమ…తెచ్చి డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించారని, దాంతోపాటు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ఐటీలు, విద్యా సంస్థలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది అని, అంతేగానీ, 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం కాదు అంటూ సభలో ప్రస్తావించారు. రుషికొండపై జనం సొమ్ము దుబారా చేసి జగన్ కట్టిన ప్యాలెస్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
This post was last modified on November 13, 2024 9:56 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…