తెలంగాణలోని వికారాబాద్‌లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇక్కడ పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చిన ప్రతీక్ జైన్.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు ప్రాధాన్యాలను వివరించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో స్థానికులు కలెక్టర్‌కు నిరసన తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడికి గ్రామస్థులు యత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ కలెక్టర్ రెండు చెంపలపై పదే పదే కొట్టారు. ఆయనను తోసి వేశారు. దీంతో పక్కనే ఉన్న మడుగులో కలెక్టర్ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతులు, యువకులు.. పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకోవడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపై కూడా రైతులుస్థానికులు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 12, 2024 9:49 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…