వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగలనుందా? ఆయనతోపాటు.. వైసీపీ తరఫున ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే చెప్పాలి. కూటమి సర్కారు తాజాగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరింది.
అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ.. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు(ప్రధాన కాదు) వైఎస్. జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఈ లేఖకు జత చేసింది. ఈ నేపథ్యంలో సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని కూటమి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంతేకాదు.. గవర్నర్ తీసుకునే నిర్ణయం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండాలని కూడా కోరింది.
అంటే.. కూటమి సర్కారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టడమే కాకుండా.. సభ్యత్వాలను సైతం రద్దుచేయించే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను బాయికాట్ చేయడం ద్వారా ఏదో సాధించాలని జగన్ భావించారు. కానీ, అది ఆయన అస్తిత్వానికే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చేలా మారిపోయింది. దీంతో భవిష్యత్తు మరింత గందరగోళంగా మారనుంది.
జగన్ లాంటి వారు ఉంటారని ఊహించి ఉండరు!
వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ.. కూటమి సర్కారు లేఖ రాయడం వరకు బాగానే ఉంది. అసలు గవర్నర్‌కు ఈ సభ్యత్వాలను రద్దుచేసే అధికారం ఉందా? అనేది ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 165 వరకు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన గవర్నర్ విధులను స్పష్టం చేస్తుంది. సభ్యులతో ప్రమాణం చేయించడం, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడం, అదేవిధంగా సభను జాగగ్రత్తగా నడిపించడం వంటివి గవర్నర్ అధీనంలో ఉంటాయి.
అయితే.. సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం విషయం రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. అంటే.. జగన్ వంటి నాయకులు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. అందుకే.. సభ్యత్వాల రద్దు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారన్నది చూడాలి.
This post was last modified on November 11, 2024 4:06 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…